Page Loader
Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..ఊగిపోయిన బిల్డింగ్స్
ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం

Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..ఊగిపోయిన బిల్డింగ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2023
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ ప్రభావంతో పలు చోట్ల రోడ్లు దెబ్బతినగా, కొన్ని భవనాలు కుప్పకూలాయి. మరికొన్ని చోట్ల గోడలు బీటలు వారాయి. వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రావిన్స్‌లోని సారంగనికి నైరుతి దిశలో 18 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.

Details

ఫిలిప్పీన్స్ లో తరుచూ భూకంపాలు

ఫిలిప్పీన్స్‌లోని రెండవ అతిపెద్ద ద్వీపంలో దాదాపు 26 మిలియన్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ దేశంలో రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఫిలిప్పీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ డైరెక్టర్ టెరెసిటో బాకోల్కోల్ ప్రకారం తాజా ప్రకంపనల వల్ల మరోసారి ప్రకంపనలు సంభవిస్తాయని తెలిపింది. ఈ ఘటనలో ప్రాణనష్టం గురించిన నివేదికలు ఇప్పటివరకూ వెల్లడించలేదు.