Loading...
Somalia: సోమాలియా తీరంలో కలకలం.. కార్గో నౌకను హైజాక్ చేసిన పైరేట్లు
సోమాలియా తీరంలో కలకలం.. కార్గో నౌకను హైజాక్ చేసిన పైరేట్లు

Somalia: సోమాలియా తీరంలో కలకలం.. కార్గో నౌకను హైజాక్ చేసిన పైరేట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

సముద్రంలో మరోసారి పైరేట్ల పంజా విసిరినట్లు తెలుస్తోంది. సోమాలియా దేశంలో పుంట్‌ల్యాండ్ తీరానికి సమీపంలో 'LUTUF' అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్లు సమాచారం. ఈ నౌక కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా.. వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇది నిజమా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది. భారత ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వివరాల్లోకి వెళితే.. పుంట్‌ల్యాండ్‌లోని ఈల్ జిల్లాలో మరయ్యా తీరానికి సుమారు 3.5 నాటికల్ మైళ్ల దూరంలో LUTUF నౌకను ఎనిమిది మంది పైరేట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వివరాలు 

నౌకలో టర్కీకి చెందిన ఆయుధాలు,కమ్యూనికేషన్ పరికరాలు,శాటిలైట్ పరికరాలు

ఈ దాడికి పాల్పడినవారు గతంలో ఏప్రిల్ 26న 'Sward'అనే మరో వాణిజ్య నౌకను హైజాక్ చేసిన బృందంతో సంబంధం ఉన్నవారిగా అధికారులు భావిస్తున్నారు.

నౌకను స్వాధీనం చేసుకున్న అనంతరం పైరేట్లు దానిని డాంగోరోయో జిల్లాలోని గార్మాల్ సమీపంలోని తీర ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.

పరిస్థితిని టర్కీకి చెందిన రెండు నౌకలు డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

హైజాక్‌కు గురైన LUTUF నౌకలో ఆరుగురు భారతీయులతో పాటు ఒక టర్కీ జాతీయుడు, ఒక జార్జియా జాతీయుడు, ఇద్దరు సెర్బియా భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

నౌకలో టర్కీకి చెందిన ఆయుధాలు,కమ్యూనికేషన్ పరికరాలు,శాటిలైట్ పరికరాలు ఉన్నట్లు ఓ సోమాలి అధికారి తెలిపారు.

వీటిని మొగాదిషులోని టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

నౌకలో టర్కీకి చెందిన ఆయుధాలు,కమ్యూనికేషన్ పరికరాలు,శాటిలైట్ పరికరాలు

అయితే నౌక హైజాక్ ఘటనపై భారత, టర్కీ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దీంతో నౌకలో ఉన్న ఆరుగురు భారతీయుల వివరాలు, వారి పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT