Loading...
Earthquake: ఇండోనేసియాలో 7.7 తీవ్రతతో భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ ముప్పు
ఇండోనేసియాలో 7.7 తీవ్రతతో భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ ముప్పు

Earthquake: ఇండోనేసియాలో 7.7 తీవ్రతతో భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ ముప్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేసియాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్‌ ద్వీపంలో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS), ఇండోనేసియా అధికార వర్గాలు వెల్లడించాయి. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు తెలిపాయి. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతకుముందు అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు

కెరటాలు 3 మీటర్లు ఎత్తు వరకు ఎగిరే అవకాశం

కొద్దిసేపటి వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించడం, ప్రధాన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

తీర ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.

సముద్రంలో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు కెరటాలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందనే సమాచారం అధికారికంగా వెలువడలేదు.

ADVERTISEMENT