Page Loader
పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి
పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి

పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి

వ్రాసిన వారు Stalin
Aug 08, 2023
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ బాంబు పేలుడు వెనుక బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బలూచిస్తాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ (యూసీ) ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని అధికారులు తెలిపినట్లు పాక్ మీడియా సంస్థ డాన్ పేర్కొంది. ఒక వివాహ వేడుక నుంచి వస్తున్న యూసీ ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పంజ్‌గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 యూసీ ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ వాహనం లక్ష్యంగా పేలుడు