Page Loader
చర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం
జర్మనీ: హాంబర్గ్‌ చర్చిలో కాల్పులు- ఏడుగుగు దుర్మరణం

చర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం

వ్రాసిన వారు Stalin
Mar 10, 2023
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీలోని హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఎంత మంది మరణించారనే పోలీసులు అధికారికంగా వెల్లడించనప్పటికీ, స్థానిక మీడియా సంస్థలు కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు పేర్కొన్నాయి. అయితే మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రాస్‌బోర్‌స్టెల్ జిల్లాలోని డీల్‌బోగే వీధిలోని చర్చిలో కాల్పులు జరిగాయని, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు, మరికొందరు మరణించారని పోలీసులు ట్వీట్ చేశారు.

జర్మనీ

కాల్పులపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన నగర మేయర్

నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తొలుత నిందితుడు మళ్లీ కాల్పులు జరపొచ్చనే అనుమానంతో చర్చి సమీపంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇంట్లో నుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు. కొన్ని గంటల తర్వాత ఆంక్షలను ఎత్తివేశారు. ఈ కాల్పులపై నగర మేయర్ పీటర్ షెంచర్ ట్విట్టర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ శాయశక్తులా కృషి చేస్తున్నాయని చెప్పారు.