Page Loader
Sherika De Armas: 26 ఏళ్లకే మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి 

Sherika De Armas: 26 ఏళ్లకే మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2023
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్,గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి 26 సంవత్సరాల వయస్సులో అక్టోబర్ 13న మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్‌ నివేదించింది. డి అర్మాస్ కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్స చేయించుకున్నారు. షెరికా డి అర్మాస్ మరణాన్ని ఆమె సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మిస్ యూనివర్స్ ఉరుగ్వే 2022 కార్లా రొమెరో స్పందిస్తూ..నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత అందమైన మహిళల్లో అర్మాస్ ఒకరు" అని విచారం వ్యక్తం చేశారు.

Details 

ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతిదీ నాకు ఇష్టం :షెరికా 

నేను మిమ్మల్నిఎప్పుడూ గుర్తుంచుకుంటాను, మీరు నాకు అందించిన మద్దతుతో నేను ఎంతో ఎదగాలని కోరుకున్నాను. మీ ఆప్యాయతతో మేము పంచుకున్న ఆనందాలు ఎప్పుడు గుర్తుండిపోతాయని లోలా డి లాస్ శాంటోస్ , మిస్ ఉరుగ్వే 2021,సంతాపం తెలిపారు. చైనాలో నిర్వహించిన 2015 మిస్ వరల్డ్ పోటీల సమయంలో నెట్‌ఉరుగ్వేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షెరికా మాట్లాడుతూ.. బ్యూటీ మోడల్‌ అయినా,అడ్వర్టైజింగ్‌ మోడల్‌ అయినా,క్యాట్‌వాక్‌ మోడల్‌ అయినా మోడల్‌గా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతిదీ నాకు ఇష్టం. ఏ మోడల్ అయినా మిస్ యూనివర్స్‌లో పాల్గొనే అవకాశాన్ని వదులుకోదని నేను భావిస్తున్నాను. . సవాళ్లతో నిండిన ఈ అనుభవాన్ని జీవించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

Details 

గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్

షెరికా తన మేకప్ లైన్‌ను కూడా ప్రారంభించింది.షే డి అర్మాస్ స్టూడియో పేరుతో హెయిర్ అండ్ పర్సనల్ కేర్ కు సంబంధించిన ఉత్పత్తులను కూడా విక్రయించింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్‌కు షెరికా తన సమయాన్నికేటాయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. 2018లో, ప్రపంచవ్యాప్తంగా 5,70,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా వేయబడింది. దాదాపు 3,11,000 మంది మహిళలు ఈ వ్యాధితో మరణించారు.