LOADING...
Shah Rukh Khan: దుబాయ్‌లో షారుక్ ఖాన్ పేరిట 55 అంతస్తుల టవర్.. దీని ప్రత్యేకతలు ఇవే!
దుబాయ్‌లో షారుక్ ఖాన్ పేరిట 55 అంతస్తుల టవర్.. దీని ప్రత్యేకతలు ఇవే!

Shah Rukh Khan: దుబాయ్‌లో షారుక్ ఖాన్ పేరిట 55 అంతస్తుల టవర్.. దీని ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈసారి బాలీవుడ్ గ్లామర్ మెరుస్తోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డ్యాన్యూబ్ ప్రాపర్టీస్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పేరుతో నిర్మించిన ప్రీమియం కమర్షియల్ ప్రాజెక్ట్ 'షారుఖ్జ్ బై డ్యాన్యూబ్'ని మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. మంగళవారం ఎక్స్‌పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగబోయే గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు డ్యాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రిజ్వాన్ సాజన్ హాజరుకానున్నారు. షేక్ జాయెద్ రోడ్‌పై 55 అంతస్తుల ఎత్తుతో నిర్మించిన ఈ టవర్‌ను దుబాయ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సముదాయాలలో ఒకటిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.

Details

చిరస్మరణీయ మైలురాయిగా నిలిచే అవకాశం

ఈ ప్రాజెక్ట్ తమ సంస్థకు, అలాగే నటుడు షారుక్ ఖాన్ 33 ఏళ్ల సినీ ప్రయాణానికి కూడా ఒక స్మరణీయ మైలురాయిగా నిలవనుందని డ్యాన్యూబ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా ఉంచుకుని ఈ హై-ఎండ్ కమర్షియల్ టవర్‌ను డిజైన్ చేశారు. డ్యాన్యూబ్ గ్రూప్ చైర్మన్ రిజ్వాన్ సాజన్ మాట్లాడుతూ, దుబాయ్ వేగవంతమైన అభివృద్ధి రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను మరింతగా పెంచుతోందని చెప్పారు. గురుగ్రామ్, ముంబై వంటి ప్రధాన మార్కెట్లతో పోలిస్తే దుబాయ్‌లో ప్రాపర్టీ ధరలు ఇంకా పోటీతత్వంగా ఉండటం పెట్టుబడిదారులకు ఇది అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తుందని వివరించారు.

Details

 'షారుఖ్జ్ బై డ్యాన్యూబ్' ప్రత్యేకతలు 

పది లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మాణం యూనిట్ ప్రారంభ ధర : రూ. 4.2 కోట్ల నుంచి స్కై పూల్ ఎయిర్ ట్యాక్సీల కోసం హెలిప్యాడ్ వ్యాలెట్ సర్వీస్ ప్రత్యేక బిజినెస్ లాంజ్‌లు మొత్తంగా 40కి పైగా అత్యాధునిక, ప్రీమియం సదుపాయాలు దుబాయ్ వ్యాపార కేంద్రంలో అత్యంత విలాసవంతమైన కమర్షియల్ ప్రాజెక్ట్‌గా 'షారుఖ్జ్ బై డ్యాన్యూబ్' నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement