ఆఫ్ఘనిస్తాన్‌ను కుదిపేసిన మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదు
ఆఫ్ఘనిస్తాన్‌ను మరో భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 6.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 05:10 గంటలకు భూకంపం సంభవించిందని, హెరాత్ నగరానికి ఉత్తరాన 29 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిన్టలు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వారంలో అఫ్గాన్‌లో సంభవించిన రెండో భారీ భూకంపం ఇది. హెరాత్ నగరానికి వాయువ్యంగా శనివారం పలుమార్లు భారీ ప్రకంపనలు సంభవించాయి. ఈ విపత్తలో 2,000 మందికి పైగా మరణించారు. వేలాది గృహాలను నేలమట్టం అయ్యాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే అఫ్గాన్‌ను మరో భూకంపం తాకింది.
సహాయక చర్యలు ముగియక ముందే మరో విపత్తు
అఫ్గాన్‌లో శనివారం వచ్చిన భూకంపం బాధితులకు సాయం చేయడం, శిథిలాల తొలగింపు, క్షతగాత్రులను గుర్తించే పనిలోనే ఇంకా వాలంటీర్లు, రక్షకులు నిమగ్నమై ఉన్నారు. ఆ సహాయక చర్యలు ఇంకా ముగియకముందే, మరో విపత్తు వచ్చిపడటంపై యంత్రాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముల్లా జనన్ సయెక్ మాట్లాడుతూ.. శనివారం సంభవించిన వరుస భూకంపాల కారణంగా చనిపోయిన, క్షతగాత్రుల కచ్చితమైన సంఖ్యలను తాము చెప్పలేమన్నారు. అలాగే బుధవారం సంభవించిన భూకంపంలో ప్రాణం నష్టం ఎంత జరిగిందనే సమాచారం ఇంకా రాలేదన్నారు. ఈ భూకంపం హేరత్ నగరానికి సమీపంలో తాకింది. ఈ నగరంలో ఇది ర మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు.