
Egg price in pakistan: అయ్య బాబోయ్.. ఒక కోడి గుడ్డు రూ.32
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం దాయాది దేశాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెడుతోంది.
నిత్యావరసరా ధరలు ఆకాశాన్నంటడంతో ఆకలి చావులు కూడా భారీగా పెరిగాయి.
పాకిస్థాన్ ప్రజలు ప్రస్తుతం ఎంత కష్టాల్లో ఉన్నారంటే.. కనీసం కోడి గుడ్డు కూడా కొనలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
పాకిస్తాన్‌లో ఒక కోడి గుడ్డు ధర రూ. 32కు చేరుకుంది. దీంతో ఆ దేశ ప్రజలు కనీసం కోడి గుడ్డును కూడా కొనలేని పరిస్థితులులో ఉన్నారు.
ఆ దేశంలో డజను కోడి గుడ్లను రూ.360కి అమ్మాలని ప్రభుత్వం చెప్పినా.. వ్యాపారులు మాత్రం రూ. 389 కి అమ్ముతున్నారు.
పాక్
కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలు
పాకిస్థాన్‌లో ఆహారం , ఇంధనం ధరలు కూడా భారీగా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది.
అమెరికా డాలరుతో పోల్చితే.. పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పతనమైంది.
దీంతో పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువుల రేట్లు కొండెక్కిన పరిస్థితి నెలకొంది.
ధరలు పెరగడం వల్ల దేశంలోని ప్రజలు బతకడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
పాకిస్థాన్‌లో రొట్టెల పిండి కోసం కూడా గతంలో తీవ్రమైన ఘర్షణ జరిగింది.
ఈ ఘర్షణలో చాలా మంది చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఆ సయమంలో వీడియో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పరిస్థితి నెలకొంది.