US: సాయం చేసిన భారత విద్యార్థిని సుత్తితో కొట్టి చంపేసిన దుండగుడు
అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. ఓ నిరాశ్రయుడికి ఆశ్రయం కల్పించిన పాపానికి ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. సాయం చేసిన కృతజ్ఞత కూడా లేకుండా.. దుండగులు విద్యార్థిని కిరాతంగా హత్య చేశాడు. ఈ నెల 16న లిథోనియా నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. హరియాణాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ ఏంబీఏ కోసం రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. జార్జియాలోని ఓ స్టోర్‌లో సైనీ క్లర్క్‌గా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
తలపై సుత్తితో దాదాపు 50 సార్లు దారుణంగా కొట్టి..
ఈ క్రమంలో నిరాశ్రయుడైన జూలియన్ ఫాల్క్‌నర్‌కు చిప్స్, కోక్, నీళ్లు, జాకెట్ ఇచ్చి గత రెండు రోజులుగా సైనీ సాయం చేస్తున్నాడు. జనవరి 16న కూడా జూలియన్ స్టోర్ వద్దకు రాగా.. అప్పటి షాపు మూసేసి వెళ్తుడున్నాడు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి వెళ్లమని జూలియన్‌ను సైనీ చెప్పగా.. అతడు అక్కడి నుంచి వెళ్లలేదు. డ్రగ్స్‌కు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్.. వివేక్ సైనీ తలపై సుత్తితో దాదాపు 50 సార్లు దారుణంగా కొట్టాడు. దీంతో సైనీ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఫాల్క్‌నర్‌గా గుర్తించారు. సైనీ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.