తదుపరి వార్తా కథనం

ఫ్రాన్స్: స్కూల్లో కత్తితో దాడి.. ఉపాధ్యాయుడు మృతి, పలువురికి గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 13, 2023
04:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర ఫ్రాన్స్‌లోని అర్రాస్‌లోని ఓ పాఠశాలలో శుక్రవారం జరిగిన కత్తి దాడిలో ఉపాధ్యాయుడు మరణించినట్లు BFM టీవీ తెలిపింది.
కత్తితో దాడి జరిగినట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు.
దుండగుడు 'అల్లాహు అక్బర్' అని అరిచాడని మీడియాలో వచ్చిన కథనాలను పోలీసులు ధృవీకరించలేకపోయారు.
ఓ పాఠశాలలో పోలీసు ఆపరేషన్ జరుగుతోందని ఫ్రెంచ్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డార్మానిన్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్కూల్లో కత్తితో దాడి.. ఉపాధ్యాయుడు మృతి
#BREAKING Teacher killed in knife attack at French school: police pic.twitter.com/n8HOpJnj26
— AFP News Agency (@AFP) October 13, 2023