Page Loader
Maldives-India row: భారత్‌తో వివాదం.. మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం! 

Maldives-India row: భారత్‌తో వివాదం.. మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం! 

వ్రాసిన వారు Stalin
Jan 09, 2024
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ వివాదం మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు పదవికి గండంలా మారింది. ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో అధ్యక్షుడు మహ్మద్ ముయిజును అవిశ్వాస తీర్మానంతో తొలగించేలా చర్యలు తీసుకోవాలని మాల్దీవుల్లోని పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అలీ అజీమ్ ట్వీట్ చేశారు. తామతో పాటు డెమొక్రాట్లు దేశ విదేశాంగ విధానం స్థిరత్వాన్ని కొనసాగించడానికి, భారత్‌తో విభేదాలను నిరోధించడానికి అంకితభావంతో ఉన్నట్లు ట్వీట్‌లో అజీమ్ చెప్పారు. అధ్యక్షుడిని తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని సచివాలయ యంత్రాన్ని ప్రశ్నించారు.

మాల్దీవులు

మాల్దీవుల రాజకీయాలను షేక్ చేస్తున్న అలీ అజీమ్ ట్వీట్

అలీ అజీమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు మాల్దీవుల రాజకీయాలను షేక్ చేస్తోంది. లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు గానూ ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. యువజన మంత్రిత్వ శాఖలోని డిప్యూటీ మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మజీద్‌లను సస్పెండ్ చేశారు. అలాగే సోమవారం భారతదేశంలోని మాల్దీవుల రాయబారిని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించి ఆ దేశ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.