Page Loader
private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం 
private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం

private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం 

వ్రాసిన వారు Stalin
Mar 12, 2024
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వర్జీనియాలోని గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు మరణించారు. ట్విన్-ఇంజిన్ IAI ఆస్ట్రా 1125విమానం ఎయిర్‌పోర్ట్ రోడ్డు వెంబడి చెట్లను ఢీకొట్టిందని వర్జీనియా స్టేట్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చెట్లను ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు చెలరేగాయని పోలీసు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ఓ చిన్నారితో పాటు మరో ముగ్గురు చనిపోయారు. ఈ క్రమంలో విమానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో కలిసి ఫ్లైట్‌లో అందులో ఉన్నవారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చెట్లను ఢీకొట్టడంతో విమానంలో మంటలు