Page Loader
8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం
8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో... ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం

8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 08, 2023
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలకు పొరపాటున తమకు తామే జారిపడితేనే తల్లిదండ్రులు ఎంతో విలవిలలాడుతారు. తమ పిల్లలకు ముళ్లు గుచ్చుకున్న తమకే గుచ్చినట్టుగా అల్లాడిపోతారు. అలాంటిది అభం శుభం ఎరుగని పసిపిల్లలపై కత్తితో దాడి అన్న పదమే ఏ అమ్మనాన్నలకైనా భయోత్పతాన్ని కలిగిస్తుంది. కానీ ఆ పరిస్థితిని ప్రత్యక్షంగా తమ చిన్నారులు ఎదుర్కొంటే ఆ కనిపెంచిన వారి మనసు ఎంత నొచ్చుకుని ఉంటుందో ఊహిస్తే ఎవరికైనా బాధనిపిస్తుంది. ఫ్రాన్స్‌లో చిన్నపిల్లలపై దారుణం జరిగింది. క‌త్తితో చిన్నారులపై దాడి చేశాడో సైకో. ఈ ఘటనలో మొత్తం ఏఢుగురు గాయ‌ప‌డ్డారు. ఇందులో ఒక్కరు మినహా మిగతా అందరూ బడి పిల్ల‌లే కావడం కలవరపెట్టే అంశం.

Details

సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్న ప్రధానమంత్రి ఎల‌జ‌బెత్ బోర్న్

ఆల్ప్స్ మౌంటేన్ రేంజస్ పరిధిలోని అనెక్కీ అనే చిన్న ప‌ట్ట‌ణంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మూడు సంవత్సరాల వయసున్న పిల్లలు ఓ స‌ర‌స్సు వ‌ద్ద ఉన్న పార్కులో ఆడుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ఓ అజ్ఞాత వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న క‌త్తితో ఆకస్మికంగా వారిపై విరుచుకుడటంతో కలకలం రేగింది. ఈ విషయమై స్పందించిన ఫ్రాన్స్ హోంశాఖ మంత్రి గెరాల్డ్ డార్మ‌నిన్, ఉన్మాదిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారుల ప‌రిస్థితి విష‌మంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దేశ ప్ర‌ధానమంత్రి ఎల‌జ‌బెత్ బోర్న్, సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నట్లు వివరించారు. దేశంలో హింసకు తావులేదని, చిన్నారులపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.