వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. రెండు రోజుల్లో ఇద్దరికి జన్మనిచ్చిన మహిళ
ప్రపంచ వ్యాప్తంగా తరుచుగా కవల పిల్లలు పుడుతూనే ఉంటారు. కొన్నిసార్లు ఒకే కాన్పులో 8 నుంచి పది పిల్లలకు జన్మనిచ్చిన ఘటనలను మనం వింటూనే ఉంటాం. అయితే అరుదుగా ఇలాంటి సందర్భాలు కన్పిస్తాయి. మరికొన్ని సందర్భల్లో మహిళలు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల వ్యవధిలో కవల పిల్లలకు జన్మనిచ్చే ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. కెల్సీ హాట్చర్ అనే మహిళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన అమెరికాలోని అలబామాలో చోటు చేసుకుంది.
రెండు గర్భాశయాల ద్వారా ఇద్దరికి జననం
ఆ మహిళ రెండు గర్భాశయాల ద్వారా రెండు వేర్వేరు రోజుల్లో కవలలకు జన్మనిచ్చింది. ఇది అత్యంత అరుదైన ఘటనగా వైద్యులు తెలిపారు. డిసెంబర్ 19న ఉదయం ఒకరికి, డిసెంబర్ 20న ఉదయం మరొకరికి జన్మనిచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయంపై కెల్సీ మాట్లాడుతూ తాను కలలో కూడా ఇలాంటి జననాలు ఊహించలేదని, ప్రస్తుతం అమ్మాయిలిద్దరినీ సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకురాలనేది తమ కల అని చెప్పింది. 2019లో బంగ్లాదేశ్‌లోనూ ఓ మహిళ ఇలాగే 26 రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు.