USA: ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు
అమెరికా ఓర్లాండోలోని ఐకాన్ పార్క్‌లో ఫ్రీ పాల్ టవర్ నుండి పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన విచారణలో ఫ్లోరిడా న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. మృతుడు టైర్ సాంప్సన్ కుటుంబానికి రూ.310 మిలియన్ డాలర్లు (2,624 కోట్లు) పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 2022లో టైర్ సాంప్సన్ తన ఫుట్‌బాల్ టీమ్‌తో ఐకాన్ పార్క్‌కు వెళ్లి, అక్కడ ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు. ఈ రైడ్‌లో సీటుబెల్ట్ ఊడిపోతే 70 అడుగుల ఎత్తులో అతడు పడి మరణించాడు. రైడ్‌కు సంబంధించి 129 కిలోగ్రాముల బరువు మాత్రమే భద్రత కోసం అనుమతించారు. అయితే సాంప్సన్ బరువు 173 కిలోలు ఉన్నా అతనిని రైడ్‌లో పాలు చేసేందుకు సిబ్బంది అనుమతించారు.
నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన
బాధితుల తరఫు న్యాయవాదులు కార్పొరేషన్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ దురదృష్టకర ఘటన జరిగిందని వాదించారు. రైడ్ తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాలపైనే దృష్టి సారించారని, ఇది బాలుడి మరణానికి కారణమైందని న్యాయవాదులు తెలిపారు. మృతుడి కుటుంబానికి 310 మిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తం 2,624 కోట్లు రూపంలో కుటుంబ సభ్యులకు ఇవ్వనుంది. దీంతో ప్రతి వ్యక్తికీ 155 మిలియన్ డాలర్లు (రూ.1,312 కోట్లు) చొప్పున అందించనున్నారు. ఈ తీర్పు వల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నిరోధించగలగాలని ఫ్లోరిడా న్యాయస్థానం పేర్కొంది.