NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం 
    తదుపరి వార్తా కథనం
    హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం 
    హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం

    హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం 

    వ్రాసిన వారు Stalin
    Aug 21, 2023
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిల్లరీ తుపాను మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం వద్ద తీరం దాటింది. ఆ తర్వాత అమెరికా రాష్ట్రమైన కాలిఫోర్నియాకు చేరుకుంది.

    తుపాను తీరం దాటి సమయంలో బీభత్సం సృష్టించింది. దక్షిణ కాలిఫోర్నియాను తీవ్రమైన వరదలతో ముంచెత్తింది.

    రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. బలమైన గాలుల ధాటికి వందలాది చెట్లు నేలకూలాయి.

    తుపాను వల్ల ఇదాహోకు ఉత్తరాన ఉన్న ప్రదేశాల్లో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు.

    84సంవత్సరాల్లో దక్షిణ కాలిఫోర్నియాను తాకిన మొదటి ఉష్ణమండల తుఫాను 'హిల్లరీ' కావడం గమనార్హం.

    బాజా కాలిఫోర్నియా, నైరుతి అమెరికా ప్రాంతాల్లో ప్రాణాంతక వరదలు ముంచెత్తుతాయని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది.

    వరదలు, ఈదురు గాలులు, టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ పేర్కొంది.

    తుపాను

    గంటకు 209 నుంచి 251 కి.మీ వేగంతో గాలులు

    హిల్లరీ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 209 నుంచి 251 కి.మీ వేగంతో గాలి వీచినట్లు అధికారులు చెప్పారు. తుపాను బలహీనపడినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

    హిల్లరీ తుపాను అమెరికా రాష్ట్రమైన కాలిఫోర్నియా వేపు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరికేన్ సెంటర్ డైరెక్టర్ మైఖేల్ బ్రెన్నాన్ పేర్కొన్నారు.

    వరదలో మెక్సికన్‌లోని శాంటా రోసాలియా పట్టణంలో ఒక వాహనం కొట్టుకుపోయింది. ఆ వాహనంలో ఐదుగురు ఉండగా, ఒకరు చనిపోయారు. మరో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.

    హిల్లరీ తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని అందుకే మెక్సికో, కాలిఫోర్నియా, నెవాడాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హరికేన్ సెంటర్ తెలిపింది.

    తుపాను

    కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్ 

    హిల్లరీ తుఫాను కాలిఫోర్నియా వైపు దూసుకురావడంతో రాష్ట్రంలో గవర్నర్ గావిన్ న్యూసోమ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆహారం, నీరు, ఇతర సహాయాలతో బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

    పర్యాటక కేంద్రమైన శాంటా కాటాలినా ద్వీపం, శాన్ బెర్నార్డినో కౌంటీలోని అనేక పర్వత ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తుపాను సన్నాహాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సీనియర్ సిబ్బంది వివరించినట్లు వైట్‌హౌస్ తెలిపింది.

    తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని బైడెన్ సూచించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    కాలిఫోర్నియా
    మెక్సికో
    తాజా వార్తలు

    తాజా

    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తాజా వార్తలు
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తాజా వార్తలు

    కాలిఫోర్నియా

    అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ట్విట్టర్
    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ టెక్నాలజీ
    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా

    మెక్సికో

    జైలుపై తుపాకులతో రెచ్చిపోయిన సాయుధులు.. 14మంది మృతి అంతర్జాతీయం
    దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్ దిల్లీ
    న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి  తుపాకీ కాల్పులు
    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  తాజా వార్తలు

    తాజా వార్తలు

    అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి నరేంద్ర మోదీ
    Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ  దిల్లీ
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    G20 summit in Delhi: జీ20 సమావేశాలకు సన్నాహాలు ప్రారంభం; అతిథుల కోసం 35 ఫైవ్‌స్టార్ హోటళ్లు బుకింగ్  జీ20 సమావేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025