Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు
అక్రమంగా కంబోడియాకు తీసుకెళ్లిన 300 మంది భారతీయులు మే 20న తమ చైనా హ్యాండ్లర్లపై తిరుగుబాటు చేశారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఆ తర్వాత వారిలో చాలా మందిని అరెస్టు చేశారు. వీరిలో 150 మంది విశాఖపట్టణంకి చెందిన వారని, ఆగ్నేయాసియాలోని కంబోడియాలో గత ఏడాది కాలంగా చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. అక్కడ సైబర్ క్రైమ్‌లు, పోంజీ స్కామ్‌లకు పాల్పడేలా చైనీస్ హ్యాండ్లర్లు బలవంతం చేస్తున్నారని తెలిపారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు తీసుకెళ్లిన భారతీయులు సైబర్ నేరాలకు కేంద్రంగా భావిస్తున్న జిన్‌బీ, సిహనౌక్‌విల్లే కాంపౌండ్‌లో అల్లర్లు సృష్టించారని చెప్పారు.
ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 5,000 మంది కంబోడియాకు
చాలా మంది వాట్సాప్ ద్వారా విశాఖపట్నం పోలీసులను సంప్రదించారని, వీడియోలు పంపారని చెప్పారు. చిక్కుకుపోయిన వ్యక్తులను తిరిగి తీసుకురావడానికి విశాఖపట్నం పోలీసులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత విభాగాలను సంప్రదించారు. వివిధ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 5,000 మందిని కంబోడియాకు పంపించారు. విశాఖపట్నం పోలీసులు మే 18న చుక్కా రాజేష్, ఎస్ కొండల్ రావు, ఎం.జ్ఞానేశ్వర్‌రావును మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితులు సింగపూర్‌లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారత్‌లోని యువతను ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడేందుకు కంబోడియాకు పంపేవారు. కంబోడియాకు చేరుకున్నతర్వాత యువకులను చైనా ఆపరేటర్లు బందీలుగా తీసుకున్నారు. వారు హింసించడమే కాకుండా ,గేమ్ మోసం,స్టాక్ మార్కెట్ మోసం,ఇతర నేరాలు చేయమని బలవంతం చేశారు.