Page Loader
Gun Fire: అమెరికాలోని కాన్సాస్ లో కాల్పులు.. ఒకరు మృతి,21మందికి గాయాలు 
అమెరికాలోని కాన్సాస్ లో కాల్పులు.. ఒకరు మృతి,21మందికి గాయాలు

Gun Fire: అమెరికాలోని కాన్సాస్ లో కాల్పులు.. ఒకరు మృతి,21మందికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2024
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా,మరో 21 మంది గాయపడ్డారు. సూపర్ బౌల్ విజేతగా నిలిచినందుకు కేన్సాస్‌ సిటీ చీఫ్స్‌ పరేడ్‌ నిర్వహిస్తుండగా కాల్పులు చోటుచేసుకున్నాయని కాన్సాస్ సిటీ అగ్నిమాపక శాఖను ఉటంకిస్తూ ABC న్యూస్ నివేదించింది. దింతో అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కాన్సాస్ సిటీ పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన వేడుకలో దాదాపు పది లక్షల మంది పరేడెగోర్లు, 600 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఉన్నారని నివేదిక తెలిపింది.

Details 

 ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది క్షేమం

కాల్పులు జరిగినప్పుడు కాన్సాస్ గవర్నర్ లారా కెల్లీ కూడా ర్యాలీలో ఉన్నారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు కేన్సాస్‌ సిటీ పోలీస్‌ చీఫ్‌ స్టేసీ గ్రేవ్స్‌ తెలిపారు. కాల్పుల ఘటనపై కేన్సాస్‌ సిటీ చీఫ్స్‌ ఆర్గనైజర్స్‌ స్పందించారు. పరేడ్ ముగింపు సమయంలో ఇలా కాల్పులు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కేన్సాస్‌ జట్టు ప్రకటించింది. సూపర్‌ బౌల్‌ ఛాంపియన్‌షిప్‌ అనేది అమెరికా నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో భాగం. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్‌ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవాలను చేపట్టింది.