Norway: దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం తర్వాత.. ప్రమాదం నుంచి తప్పించుకున్న మరో రెండు విమనాలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే, మరో రెండు విమానాలు వేర్వేరు దేశాల్లో ప్రమాదాలను తప్పించుకున్నాయి.
శనివారం రాత్రి, కెనడాలోని హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ కెనడాకు చెందిన AC2259 విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
విమానంలోని ల్యాండింగ్ గేర్ విఫలమై, రన్‌వేపై జారిపోవడంతో మంటలేర్పడ్డాయి. ఈ విమానం సెయింట్ జోన్స్ నుంచి హాలిఫాక్స్‌కు ప్రయాణిస్తుండగా, ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో విమాన రెక్కలు రన్‌వే పై రాసుకుపోయాయి, దీంతో మంటలు వచ్చినట్లు ప్రయాణికులు తీసిన వీడియోలలో కనిపించింది.
Details
హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా అదుపు తప్పిన విమానం
ఈ కారణంగా, ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఇదే సమయంలో, నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం అదుపు తప్పి, 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోర్ప్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఈ విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా అదుపు తప్పినా విమానం సురక్షితంగా గడ్డి మైదానంలో ఆగిపోయింది. ఈ సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు ఉన్నారు.
వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎయిర్‌పోర్టు మూసివేశారు.