LOADING...
Greta Thunberg: గ్రెటా థన్‌బర్గ్‌ ప్రయాణిస్తున్న సహాయ నౌకపై ట్యునీషియాలో డ్రోన్ దాడి 
గ్రెటా థన్‌బర్గ్‌ ప్రయాణిస్తున్న సహాయ నౌకపై ట్యునీషియాలో డ్రోన్ దాడి

Greta Thunberg: గ్రెటా థన్‌బర్గ్‌ ప్రయాణిస్తున్న సహాయ నౌకపై ట్యునీషియాలో డ్రోన్ దాడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

గాజా ప్రాంతంలో మానవతాసాయం, హక్కుల పరిరక్షణ కోసం ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ నౌకలో ప్రముఖ స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రీటా థన్‌బర్గ్ (Greta Thunberg) సహా అనేక మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు. డ్రోన్ దాడి ట్యునీషియా తీరానికి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నౌకలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు గ్లోబల్ సముద్ర ఫ్లోటిల్లా (Global Sea Flotilla - GSF) సంస్థ ధ్రువీకరించింది.

వివరాలు 

దాడి సమయంలో నౌకలోనే  ప్రయాణికులు,సిబ్బంది సురక్షితం

ఫ్లోటిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు పోర్చుగీస్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన ఈ దాడిని GSF ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఫ్లోటిల్లా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి సమయంలో ప్రయాణికులు, సిబ్బంది నౌకలోనే సురక్షితంగా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడి పై మరింత సమాచారం రావాల్సి ఉందని పేర్కొంది. గాజా మార్గంలో జరిగే ఇలాంటి దురాక్రమణ చర్యలు తమ ఉద్దేశ్యాన్ని ఆపలేవని స్పష్టంగా తెలియజేసింది. ప్రస్తుతం ఈ నౌకలో గ్రీటా థన్‌బర్గ్‌తో పాటు మొత్తం 44 దేశాల ప్రజలు ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

పాలస్తీనా జెండాలు ఎగురవేసి నినాదాలు

అయితే, ఈ డ్రోన్ దాడికి సంబంధించిన వాదనలను ట్యునీషియా అధికారులు ఖండించారు వారు ఎలాంటి డ్రోన్ దాడికి సంబంధించిన ఆధారాలు లేకపోవడమే కాకుండా, నౌకలోపలే పేలుడు సంభవించిందని నేషనల్ గార్డ్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత ట్యునీషియాలోని సీడీ బౌ సౌద్ ఓడరేవు ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని పాలస్తీనా జెండాలు ఎగురవేసి నినాదాలు చేయడం ప్రారంభించారు.