Page Loader
Middle East : దక్షిణ లెబనాస్‌లో వైమానిక దాడి.. 9 మంది మృతి
దక్షిణ లెబనాస్‌లో వైమానిక దాడి.. 9 మంది మృతి

Middle East : దక్షిణ లెబనాస్‌లో వైమానిక దాడి.. 9 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2024
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా రోజు రోజుకూ రణరంగాన్ని తలపిస్తోంది. తాజాగా శనివారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. మరో ఎనిమిది మంది గాయపడినట్లు పేర్కొంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ దాడుల్లో కొన్ని క్షిపణులు హిజ్బుల్లా ఆయు ధ స్థావారాలను తాకినట్లు తెలిసింది. శనివారం తెల్లవారుజామున నబాతిహ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఒక మహిళ, ఆమె ఇద్దరి పిల్లలు, మరో ఐదుగురు గాయపడ్డారు.

Details

ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు

ఇజ్రాయెల్ దాడి చేసిన హిజ్బుల్లా ఆయుధ స్థావరం ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత అక్టోబర్‌లో గాజా స్ట్రిప్‌లో యుద్ధం ప్రారంభమైంది. అప్పటినుంచి హిజ్బుల్లా గ్రూప్, ఇజ్రాయెల్ దళాలు సరిహద్దులో ప్రతి రోజు కాల్పులు జరుపుకుంటున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తులు ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి చర్చలు జరుపుతున్నా అవి ఫలించడం లేదు. దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.