విమానంలో బాలికపై లైంగిక వేధింపులు.. ఎయిర్ లైన్స్‌పై రూ.16 కోట్లకు దావా
విమానంలో మద్యం మత్తులో బాలికతో పాటు అమె తల్లి పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మద్యం తాగిన వ్యక్తి, పక్క సీట్లో ఉన్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అడ్డుచెప్పిన ఆమె తల్లితోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. అయినా విమానాయన సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకోక పోగా, మద్యం సరఫరా చేయడం గమనార్హం. దీంతో తమ విషయంలో సదరు విమానాయ సంస్థ దారుణంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ బాధితులు రూ. 16 కోట్లకు దావా వేశారు. ఈ ఘటన గతేడాది జరగ్గా, ఇటీవల ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో ఈ విషయం బయటికి వచ్చింది.
న్యాయస్థానంలో దావా వేసిన బాధిత మహిళ
న్యూయార్క్ లోని జేఎఫ్‌కే ఎయిర్ పోర్టు నుంచి గ్రీస్ లోని ఏథెన్స్ కు జులై 2022లో డెల్టా సంస్థకు చెందిన ఓ విమానం బయలుదేరింది. ఈ విమానంలో 16ఏళ్ల యువతి తన తల్లితో కలిసి కుర్చొంది. పక్క సీటులో కూర్చున్న వ్యక్తి మద్యం తాగి మైనర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే బాలిక ఆమె తన తల్లికి విషయాన్ని చెప్పింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ వ్యక్తి, వారిద్దరిపై అసభ్యంగా చేతులు వేయడం ప్రారంభించాడు. ఇంత జరిగినా విమాయాన సిబ్బంది అతడిపై అధికారులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధిత మహిళ న్యాయపోరాటానికి దిగి రూ.16 కోట్లు పరిహారం చెల్లించాలని దావా వేసింది.