అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
దక్షిణ అమెరికా రాష్ట్రమైన అలబామాలో 'స్వీట్ 16' పార్టీ మారణహోమంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో సామూహిక తుపాకీ కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కకడే మృతి చెందగా, 15మందికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. డౌన్‌టౌన్ డాడెవిల్లేలో శనివారం రాత్రి 10:34 గంటలకు ఈ సంఘటన జరిగిందని అలబామా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఆదివారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు ఫిల్‌స్టావియస్ డౌడెల్, ఒక హైస్కూల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌తో పాటు, పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయి సోదరుడు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమం
సామూహిక కాల్పుల్లో మరణించిన పిల్లలందరినీ చూడటం నిజంగా బాధాకరమని అధికారులు చెప్పారు. గాయపడిన వారిలో 15 మంది టీనేజర్లలో ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిది మందిని ఇతర వైద్య సదుపాయాలకు తరలించారు. వారిలో ఐదుగురు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ అతను ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం తెలియాల్సి ఉంది.