
Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో అల్బనీస్ లేబర్ పార్టీదే విజయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.
శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయదిశగా సాగుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
తదుపరి పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి జనాభా అధికంగా ఉన్న తూర్పు రాష్ట్రాల్లో ఓటింగ్ ముగిసిపోయింది. మిగిలిన రెండు గంటల్లో ఓటింగ్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Details
తక్కువ సమయంలోనే ఫలితాలు
ఓటింగ్ ముగిసిన అనంతరం తక్కువ సమయంలోనే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒపీనియన్ పోల్‌ల ప్రకారం, లేబర్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రధానమంత్రి అల్బనీస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు సమాచారం.
మరోవైపు ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్ విధానపరమైన తప్పుల కారణంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న సిద్ధాంత పరమైన అనుబంధం వల్ల ప్రజాదరణ కోల్పోయినట్లు అంచనా.
ఫెడరల్ ఎన్నికల్లో ఆయన తన పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయే అవకాశముందని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది.