కెనడా కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలు నిలిపివేత.. 17వేల వీసా దరఖాస్తులపై ప్రభావం
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్య అనంతరం భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని భారత్ చేసిన సూచనల ప్రకారం కెనడా సిబ్బందిని వెనక్కి రప్పించుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, ముంబయా, చండీగఢ్ నగరాల్లో ఉన్న కెనగా కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలు బంద్ అయ్యాయి. దీంతో 17వేల వీసా దరఖాస్తులపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో కెనడా వెళ్లాలనుకునే భారతీయులపై ఏ మేరకు ప్రభావం చూపనుందన్న విషయంపై ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు 42 మందిని కెనడా వెనక్కి పిలిపించుకుంది.
కెనడాలో 20లక్షల మంది భారతీయులు
ఎవరికైనా కాన్సులట్ సాయం కావాలనుకుంటే దిల్లీలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది. ఇక భారత్ తో 27 మంది ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఉండగా ఆ సంఖ్యను ఐదుకు తగ్గించినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్,రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ వెల్లడించింది. అయితే తాజా పరిణామాలతో వీసా జారీ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. భారత్, కెనడా పౌరుల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందని, భారతీయులను ఎప్పుడూ స్వాగతిస్తామని కెనడా స్పష్టం చేసింది. సూమారు 3.8 కోట్లు జనాభా కలిగిన కెనడాలో 20లక్షల మంది భారతీయులే ఉండడం విశేషం.