Joe Biden: విశ్రాంతి లేని విదేశీ ప్రయాణాల వల్ల సరిగా మాట్లాడలేకపోయా.. జో బైడెన్ వివరణ
రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై తన పేలవమైన చర్చకు ముందు విదేశీ ప్రయాణాలు కారణమయ్యాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివరణ ఇచ్చారు. వరుస ప్రయాణాలు జెట్ లాగ్ కు దారితీసిందన్నారు." నా సిబ్బంది చెప్పినా తను వారి మాట వినలేదు," అని సంజాయిషీ ఇచ్చారు. ఆ బడలికతో నేను దాదాపు వేదికపై నిద్రపోయానని ఆయన వివరించారు.
జెట్ లాగ్ తో వేదికపై నిద్రపోయా
నిధుల సమీకరణ సమావేశంలో బైడెన్ తన ప్రత్యర్ధి ట్రంప్ కంటే వెనుక పడ్డారని వార్తలు వచ్చాయి. కాగా దీనిపై ఆయన స్పందించారు.ఇది సాకు కాదు, వివరణ అని అన్నారు. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని తన వెకేషన్ హోమ్‌లో విశ్రాంతి తీసుకోవాలని వ్యక్తిగత సిబ్బంది చెప్పారు.కానీ బైడెన్ వినిపించుకోలేదు. దీనికి ముందు బైడెన్ కేవలం 14 రోజుల వ్యవధిలో ఫ్రాన్స్‌కు,మళ్లీ యునైటెడ్ స్టేట్స్‌కు,ఇటలీకి, ఇతర ప్రయాణాలకు వెళ్లారు.
విమర్శలపై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి
అంతకు ముందు ముగిసిన చర్చ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్ధి బైడెన్ పై విరుచుకుపడ్డారు. ఆయన వల్లే అతన్ని ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ట్రంప్ ఆరోపించారు.ఇది ప్రపంచ వేదికపై వైఫల్యానికి దారితీసిందన్నారు. కాగా ఈ విమర్శలపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పందించారు. బైడెన్ పదవిలోకి వచ్చినప్పటి నుండి ఆయన పని తీరును ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారన్నారు.