USA strikes : మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. జలసంధి ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాలు, వాణిజ్య నౌకలకు ముప్పు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మాధ్యమాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా అధికారి తెలిపారు. అమెరికాకు చెందిన ఒక వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు నాలుగు డ్రోన్‌లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటిని అమెరికా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించారు.
వివరాలు
ఇరాన్ తీవ్ర ఆగ్రహం
ఇరాన్ నుంచి మరిన్ని దాడులు జరిగే అవకాశాలను ముందుగానే అరికట్టేందుకు ఆ దేశ సైనిక స్థావరంపై దాడులు చేపట్టినట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసమే చేపట్టిన చర్యలని సమర్థించుకున్నాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించిందనే అంశంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అమెరికా పదేపదే హర్మూజ్ సమీపంలో సైనిక చర్యలు చేపట్టడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.
వివరాలు
బందర్ అబ్బాస్ ఓడరేవు పట్టణం సమీపంలో భారీ పేలుళ్లు
ఇదిలా ఉండగా.. ఈ దాడులకు ముందు ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవు పట్టణం సమీపంలో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. వరుసగా మూడు పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇరాన్ వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఆ పేలుళ్లు ఎలా జరిగాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
వివరాలు
అబ్రహాంపై సంతకాలు చేస్తేనే.. ఇరాన్‌తో ఒప్పందం
అబ్రహాం ఒప్పందాల విషయంలో గల్ఫ్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని మరింత పెంచారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు అంగీకరిస్తేనే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలపై ఆయా దేశాలు సంతకాలు చేసేలా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌లు చర్చలు జరుపుతున్నారని తెలిపారు.