Page Loader
USA: ట్రంప్ గెలుపుతో హుతీలపై అమెరికా మొదటి దాడి
ట్రంప్ గెలుపుతో హుతీలపై అమెరికా మొదటి దాడి

USA: ట్రంప్ గెలుపుతో హుతీలపై అమెరికా మొదటి దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా యుద్ధ విమానాలు భీకర దాడులు చేశాయి. శనివారం సాయంత్రం చేపట్టిన ఈ దాడుల్లో మూడు కీలక ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు పెంటగాన్ ప్రకటించింది. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసేందుకు సిద్ధం చేసిన అధునాతన ఆయుధాలను పేల్చేశామని పెంటగాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Details

దాడులను ధ్రువీకరించిన పెంటగాన్

ఆయన అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైన వేళ అమెరికా ఫైటర్‌ జెట్‌లు తమ మొదటి దాడులను చేశాయి. అక్టోబర్‌లో కూడా అమెరికా బి-2 బాంబర్లు భారీ బంకర్ బస్టర్ బాంబులతో ఆయుధ డిపోలను లక్ష్యంగా చేశాయి. ఈ దాడులు అంగీకరించి, తాజాగా అమెరికా తమ దీర్ఘశ్రేణి స్ట్రాటజిక్ బాంబర్లు, ఫైటర్‌ జెట్‌లు, ఇతర ఆయుధాలతో గల్ఫ్ ప్రాంతానికి తరలించింది.