Page Loader
Israel-Iran: పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు అమెరికా కీలక నిర్ణయం.. భారీ సైనిక సామగ్రి తరలింపు
పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు అమెరికా కీలక నిర్ణయం.. భారీ సైనిక సామగ్రి తరలింపు

Israel-Iran: పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు అమెరికా కీలక నిర్ణయం.. భారీ సైనిక సామగ్రి తరలింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై అణిచివేత చర్యగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా సైనిక సామగ్రిని అక్కడికి తరలించనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ మాట్లాడుతూ ఇరాన్ లేదా దాని మద్దతుదారులు అమెరికా పౌరులు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటే, వారిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీర్ఘ శ్రేణి బీ-52 బాంబర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే మిషన్లను పశ్చిమాసియాకు తరలించనున్నట్లు వెల్లడించారు. తాజా ఏర్పాట్లు ఇరాన్‌కు హెచ్చరికగానే అమెరికా చేస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది.

Details

దాడులపై తీవ్రంగా స్పందించిన ఇరాన్

ఇటీవలే 'హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్' బ్యాటరీతో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపింది. అక్టోబర్ 1న టెల్ అవీవ్‌పై ఇరాన్ దాదాపు 200 క్షిపణులతో దాడి చేయగా, ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో నలుగురు సైనికులు మృతి చెందగా, క్షిపణి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులకు తీవ్ర స్పందనగా ఇరాన్ హెచ్చరించింది. అమెరికా తాజా సైనిక తరలింపులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రతరం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.