Page Loader
మరోసారి స్లిప్పై కిందపడ్డ అమెరికన్ ప్రెసిడెంట్.. నవ్వులు పూయించిన జో బైడెన్ 

మరోసారి స్లిప్పై కిందపడ్డ అమెరికన్ ప్రెసిడెంట్.. నవ్వులు పూయించిన జో బైడెన్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 02, 2023
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

యూనిటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. ఈ క్రమంలో తన కాలికేదో తగిలి కిందపడ్డానని నవ్వులు పూయించారాయన. అనంతరం ఎవరి సహకారం లేకుండానే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు బైడెన్. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి గాయాలు కాలేదని వైట్‌ హౌస్ అధికారికంగా ప్రకటించింది. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఈ ఘటన జరగగా,దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. సుమారు 80 ఏళ్ల వయసులో అమెరికాకు అధ్యక్షుడై బైడెన్, చరిత్ర సృష్టించారు. గ్రాడ్యుయేషన్ డే దాదాపు 90 నిమిషాల పాటు జరగగా, కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన బైడెన్ పలువురు విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.

జో బైడెన్ 

గతంలోనూ తూలిపడ్డ అమెరికా అధ్యక్షుడు

జో బైడెన్ పలుమార్లు గతంలోనూ ఇలాగే స్లిప్పై కింద పడ్డారు. ఓసారి సొంత రాష్ట్రం డెలావర్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న ఓ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. త‌న‌ను చూసేందుకు వ‌చ్చిన వారి వ‌ద్ద‌కి వెళ్లేందుకు జో బెడైన్ సైకిల్ మీద బ‌య‌లుదేరారు. సైకిల్ తొక్కుతోన్న స‌మ‌యంలో అనుకోకుండా కింద‌ప‌డ్డారు. సైకిల్ దిగే సమయంలో ఆయన పాదం పెడల్‌లోనే ఇరుక్కుంది. ఫలితంగా సైకిల్ దిగేందుకు ఇబ్బంది పడుతూ తూలి కుడివైపునకు పడిపోయారు. అనంతరం తాను బాగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని ప్రెసిడెంట్ భరోసా ఇచ్చారు. మరోసారి అధ్యక్షుడి అధికారిక విమానం 'ఎయిర్‌ఫోర్స్ వన్' ఫ్లైట్ ఎక్కుతూ మెట్లపై నుంచి పడిపోవడం గమనార్హం.