#NewsBytesExplainer: అమెరికా రాజకీయాల్లో క్షమాభిక్ష వివాదం.. అసలు 'ఆటోపెన్' వివాదం ఏంటీ?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య ప్రత్యక్ష రాజకీయం వేడెక్కింది. ట్రంప్ చేసిన తాజా ప్రకటన ఈ వివాదానికి కేంద్ర బిందువైంది.
తన పాలనలో మంజూరుచేసిన క్షమాభిక్షలు చెల్లవంటూ ఆయన తేల్చిచెప్పారు.
గత పాలక వ్యవస్థ ఇచ్చిన క్షమాభిక్షలన్నిటినీ ఆటోపెన్ ద్వారా సంతకం చేశారని, బైడెన్‌కు వాటి గురించి పూర్తిగా తెలియదని ట్రంప్ ఆరోపించారు.
బైడెన్ నిద్ర మత్తులో ఉండగా, రాజకీయ దళారులు అనేక మందికి క్షమాభిక్షలు ఇచ్చారని, అయితే అవి చట్టబద్ధంగా అమలుకావని స్పష్టం చేశారు.
Details
కోర్టుల మీద ఆధారపడి ఉంటుంది
అసలు, బైడెన్ ఈ క్షమాభిక్షల సంతకానికి ఆటోపెన్ వాడారా? లేదా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఈ అంశం బైడెన్ ఆరోగ్యంపై సందేహాలకు దారితీస్తోంది.
ట్రంప్ కూడా తన స్వరాన్ని స్వల్పంగా మార్చుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్ - "అది నా వ్యక్తిగత నిర్ణయం కాదు, కోర్టుల మీద ఆధారపడి ఉంటుంది.
కానీ అవి చెల్లవని నేను చెప్పాను. ఏం జరిగిందన్నది బైడెన్‌కు పూర్తిగా తెలియకపోవచ్చని వ్యాఖ్యానించారు.
Details
అసలు ఏమిటి ఆటోపెన్?
ఆటోపెన్ అనేది సాధారణంగా వినిపించే పేరు. ఇది డూప్లికేట్ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే ఒక యాంత్రిక పరికరం.
ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పెద్ద సంస్థల అధినేతలు తమ ఆటోగ్రాఫ్‌లు పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
ఒక ప్రింటర్ సైజులో ఉండే ఈ యాంత్రిక హస్తం సాధారణ పెన్ను లేదా పెన్సిల్‌ను పట్టుకుని, ప్రీ-ప్రోగ్రామ్ చేసిన సంతకాన్ని పునరుత్పత్తి చేయగలదు.
ఇటీవల మేరీల్యాండ్‌కు చెందిన 'ది ఆటోపెన్ కంపెనీ' స్పందిస్తూ - విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర సంస్థలు దాదాపు 60 ఏళ్లుగా దీన్ని వాడుతున్నాయని వెల్లడించింది.
అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ నాయకులు దీన్ని ఉపయోగించినట్లు తెలిపింది.
Details
19వ శతాబ్దంలోనే వినియోగించినట్లు సమాచారం
ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆటోపెన్ పరికరం మొదటిపాటి 19వ శతాబ్దంలోనే వినియోగించినట్లు సమాచారం. అప్పట్లో పాలిగ్రాఫ్ యంత్రాన్ని ఉపయోగించి రెండు పెన్నులతో ఒకేసారి సంతకం చేసేకి వీలుండేది.
1803లో దీని కోసం పేటెంట్ దాఖలైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ కూడా పదవీకాలం తర్వాత దీన్ని ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది.
2005లో అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 'ది ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్' ఆటోపెన్ వినియోగం చట్టబద్ధమేనని ప్రకటించింది.
గతంలో అనేక అమెరికా అధ్యక్షులు దీన్ని ఉపయోగించారు. బరాక్ ఒబామా కూడా ది పేట్రియాట్ యాక్ట్‌కు సంబంధించి తీసుకున్న ఒక కీలక నిర్ణయంపై ఆటోపెన్ ద్వారా సంతకం చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.