NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel- Palestine: పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ మాజీ భద్రతా చీఫ్ సంచలన కామెంట్స్ 
    తదుపరి వార్తా కథనం
    Israel- Palestine: పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ మాజీ భద్రతా చీఫ్ సంచలన కామెంట్స్ 
    Israel- Palestine: పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ మాజీ భద్రతా చీఫ్ సంచలన కామెంట్స్

    Israel- Palestine: పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ మాజీ భద్రతా చీఫ్ సంచలన కామెంట్స్ 

    వ్రాసిన వారు Stalin
    Jan 15, 2024
    10:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ భద్రతపై ఇజ్రాయెల్ భద్రతా దళం 'షిన్ బెట్' మాజీ చీఫ్ రిటైర్డ్ అడ్మిరల్ అమీ అయాలోన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఇజ్రయెల్ భద్రత.. పాలస్తీనా దేశ ఉనికితో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

    'ది గార్డియన్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్‌కు కీలక సూచనలు చేశారు.

    ప్రస్తుతం హమాస్ లక్ష్యంగా గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు.. హమాస్‌ను బలహీనపరిచే బదులుగా.. దానికి మద్దతును పెంచే విధంగా ఉన్నాయని హెచ్చరించారు.

    'పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌పై ఆధారపడి ఉన్నప్పుడే మన దేశానికి భద్రత భద్రత ఉంటుంది. సైనిక భాషలో చెప్పాలంటే.. కోల్పోయేది ఏమీ లేదని ఎదుటి వ్యక్తి అనుకున్నప్పుడు.. మీరు ఒక వ్యక్తిని గానీ, ఒక సమూహాన్ని గానీ అరికట్టలేరు' అని అయాలోన్ స్పష్టం చేశారు.

    ఇజ్రాయెల్

    హమాస్ అనేది పాలస్తీనియన్లందరికీ ప్రాతినిధ్యం వహించదు: అయాలోన్ 

    అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను సమర్థిస్తూనే.. పాలస్తీయన్లకు అయాలోన్ మద్దతుగా మాట్లాడారు.

    హమాస్ అనేది పాలస్తీనియన్లందరికీ ప్రాతినిధ్యం వహించదనే విషయాన్ని.. చాలా మంది ఇజ్రాయెలీలు గుర్తించడంలో విఫలమయ్యారని ఆయన నొక్కి చెప్పారు.

    పాలస్తీనియన్లందరూ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని లేదా దానితో అనుబంధంగా ఉన్నారని ప్రబలంగా ఉన్న ఇజ్రాయెలీల నమ్మకాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య పాలస్తీనా ఉనికికే ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు.

    ఇజ్రాయెల్

    'ఇంతిఫాదా' నాయకుడిని విడుదల చేసి చర్చలు జరపాలి: అయాలోన్ 

    పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య వివాదం మరింత ప్రమాదకరంగా మారకకుండా ఉండాలంటే.. రెండు వర్గాల మధ్య అర్ధవంతమైన చర్చలు జరగాలని అయాలోన్ ఆకాంక్షించారు.

    ఇందుకోసం జైలులో ఉన్న రెండో 'ఇంతిఫాదా' ఉద్యమ నాయకుడు మర్వాన్ బర్ఘౌటిని విడుదల చేయాలని ప్రతిపాదించారు.

    పాలస్తీనా ఎన్నికలలో బార్ఘౌటికి ఉన్న ప్రజాదరణ ఏంటో అర్థమైందని, అందుకే రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ఆయన్ను ముందుపెట్టాలని అయాలోన్ ప్రతిపాదించారు.

    రాజకీయ లక్ష్యం లేని యుద్ధాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    పాలస్తీనా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    తాజా వార్తలు

    తాజా

    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఇజ్రాయెల్

    Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్  హమాస్
    యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్  హమాస్
    గాజాలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ టాప్ కమాండర్, ఉగ్రవాదులు హతం  హమాస్

    పాలస్తీనా

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి  ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం: గాజా ఆసుపత్రిపై దాడి.. 500 మంది మృతి  అంతర్జాతీయం
    ఇజ్రాయెల్‌పై పాలస్తీనా రాయబారి ఎదురుదాడి  పాలస్తీనా
    Israel-Hamas War: గాజా ఆస్పత్రిపై దాడికి ముందు.. ఆ తర్వాత.. వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్-హమాస్ వార్ : హిజ్బుల్లా రంగంలోకి దిగితే అంతే సంగతులు అంతర్జాతీయం

    తాజా వార్తలు

    Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం  కోరుట్ల
    APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ
    Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు బెంగళూరు
    Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025