West Asia: పశ్చిమాసియాకు మరో 10 వేల అమెరికా బలగాలు.. భారీగా పెరగనున్న సైనిక శక్తి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి అమెరికా మరిన్ని సైనిక బలగాలను తరలిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా యూఎస్‌ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ అనే విమానవాహకనౌకను పశ్చిమాసియాకు పంపుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో యూఎస్‌ఎస్ జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్‌ఎస్ జార్జి వాషింగ్టన్ అనే రెండు విమానవాహక నౌకలున్నాయి. తాజాగా థియోడోర్ రూజ్‌వెల్ట్ కూడా అక్కడికి చేరనుండటంతో మొత్తం మూడు విమానవాహక నౌకలు పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఉనికిని మరింత పెంచనున్నాయి.
వివరాలు
భారీగా అమెరికా సైనిక శక్తి
మూడో విమానవాహక నౌకతో పాటు వార్‌షిప్‌లతో కూడిన స్ట్రైక్ గ్రూప్ కూడా ఆ ప్రాంతానికి చేరుకోనుంది.
వీటికి తోడు మరో 10 వేల మంది అమెరికా సైనిక బలగాలు పశ్చిమాసియాకు తరలిరానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో అమెరికా సైనిక శక్తి భారీగా పెరగనుంది.
ఇదిలా ఉండగా.. నవంబరు 3న అమెరికాలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై కొత్తగా దాడులకు దిగుతామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో తాజా సైనిక మోహరింపులకు ప్రాధాన్యం ఏర్పడింది.
పశ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.