LOADING...
Iran: అమెరికాకు మరో దెబ్బ.. రెస్క్యూ విమానం కూల్చేసినట్లు ఐఆర్‌జీసీ సంచలన ప్రకటన
అమెరికాకు మరో దెబ్బ.. రెస్క్యూ విమానం కూల్చేసినట్లు ఐఆర్‌జీసీ సంచలన ప్రకటన

Iran: అమెరికాకు మరో దెబ్బ.. రెస్క్యూ విమానం కూల్చేసినట్లు ఐఆర్‌జీసీ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ వేదికపై పరిణామాలు సూచిస్తున్నాయి. యూఎస్‌కు చెందిన F-15E యుద్ధవిమానం కూలిన ఘటనలో గల్లంతైన రెండో పైలట్‌ను రక్షించామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పైలట్‌ కోసం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న విమానాన్ని తాము కూల్చివేశామని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన విమానాన్ని తమ దళాలు ధ్వంసం చేశాయని ఇరాన్ మీడియా పేర్కొంది. ఆ విమానం అమెరికా వైమానిక దళానికి చెందిన C-130 అని వెల్లడించింది. 'ఫరాజ్ రేంజర్స్' అనే ప్రత్యేక పోలీసు కమాండో యూనిట్ ఈ చర్యలో పాల్గొన్నట్లు ఖతార్ మీడియా తెలిపింది.

వివరాలు

అధికారిక ప్రకటన ఇవ్వని అమెరికా

ఇతర యుద్ధవిమానాలకు ఇంధనం నింపేందుకు వచ్చిన ఈ విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో సిబ్బంది పరిస్థితిపై స్పష్టత లేదు. దీనిపై అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో ఆ ఆపరేషన్ సందర్భంగా ఇరాన్ సాయుధ దళాలు కలిసి అనేక అమెరికా విమానాలను ధ్వంసం చేశాయని ఐఆర్‌జీసీ పేర్కొంది. ఈ దాడుల్లో అమెరికా దళాలకు చెందిన ఐదుగురు మరణించినట్లు కూడా ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖతమ్ అల్-అన్వియా కేంద్ర ప్రధాన కార్యాలయం ప్రతినిధి వివరాల ప్రకారం, కూల్చివేసిన వాటిలో ఒక C-130 విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఉన్నాయి.

వివరాలు

తన

అంతకు ముందు ఇదే ప్రాంతంలో ఒక ఇజ్రాయెల్ డ్రోన్‌ను కూడా కూల్చివేశామని ఇరాన్ దళాలు తెలిపాయి. ఇక ముందుగా కూలిపోయిన F-15E స్ట్రైక్ ఈగల్ ఘటనలో ఒక పైలట్ గల్లంతయ్యగా, అతడిని అమెరికా సైన్యం సాహసోపేతంగా రక్షించినట్లు ట్రంప్ తెలిపారు. ఆ పైలట్ ప్రస్తుతం అమెరికా బలగాల వద్ద సురక్షితంగా ఉన్నాడని చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం డజన్ల కొద్దీ విమానాలను వినియోగించినట్లు వెల్లడించారు.

Advertisement