Page Loader
Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్!
పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్!

Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరోవైపు బలూచిస్థాన్‌ రూపంలో భారీ సవాల్‌ ఎదురవుతోంది. బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని వేర్పాటువాద గ్రూపులు స్పష్టమైన ప్రకటనలు చేయడం, ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తులు చేయడం... పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బలూచిస్థాన్‌ విడిపోతుందా? బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA)తో పాటు ఇతర వేర్పాటువాద సంస్థలు బలూచిస్థాన్‌ను విడిచి ఉత్కంఠతో స్వతంత్ర దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసి, తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరాయి. వరుసగా జరిగే దాడులతో పాక్‌ సైన్యం రక్షణ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎదుర్కొంటోంది.

Details

ఇక అక్కడే యుద్ధం 

భారత్‌పై డ్రోన్లతో దాడికి పాక్‌ సైన్యం ప్రణాళికలు వేస్తుంటే, బలూచిస్థాన్‌లో బీఎల్‌ఏ కీలక ప్రాంతాలపై పట్టు సాధిస్తోంది. అక్కడ గస్తీ కాస్తున్న సైనికులపై బాంబులు, బుల్లెట్లు వర్షంలా కురిపిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. తూర్పున భారత్‌ ఒత్తిడి పెంచితే, పశ్చిమాన బలూచిస్థాన్‌ రెబల్స్‌ తీవ్రంగా ప్రభావం చూపుతున్నారు. దీంతో పాక్‌ను సంక్షోభంలోకి నెట్టుతోంది.

Details

దాడులు ధాటిగా..!

గత కొన్ని రోజులుగా బలూచిస్థాన్‌లో బీఎల్‌ఏ రెబల్స్‌ వరుస దాడులు చేస్తున్నారు. గురువారం క్వెట్టాలో నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులు సంభవించాయి. కెచ్‌, మస్టంగ్‌, కచి ప్రాంతాల్లో బీఎల్‌ఏ ఆర్మీపై దాడులు చేసింది. దస్తక్‌ ప్రాంతంలో ఐఈడీ పేలుడులో ఓ బాంబు నిర్వీర్య బృంద సభ్యుడు మరణించాడు. కెట్గాన్‌లో సైనిక ఔట్‌పోస్ట్‌పై దాడిలో పలు మరణాలు సంభవించాయి. జమురాన్‌ షా డ్యామ్‌ వద్ద సైనిక వాహనాలను ధ్వంసం చేశారు. వీటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Details

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బలూచిస్థాన్‌..!

బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని వేర్పాటువాదులు జోరుగా డిమాండ్‌ చేస్తున్నారు. పాక్‌ జెండాలను తొలగించి బలూచిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తున్నారు. 'మమ్మల్ని ఐక్యరాజ్యసమితి గుర్తించాలి. మా భద్రత కోసం శాంతి దళాలు పంపాలి. పాక్‌ సైన్యం వెనక్కి వెళ్లాలి. మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసి క్యాబినెట్‌ ప్రకటించతున్నామని వారు ప్రకటించారు. భారత్‌లో దౌత్య కార్యాలయం..? బలూచ్‌ రచయిత మిర్‌ యార్‌ బలూచ్‌ వెల్లడించిన ప్రకారం, పాకిస్థాన్‌ తుది ఊపిరి తీస్తున్నట్లు స్పష్టమవుతోంది. ''పాకిస్థాన్‌కు వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. బలూచిస్థాన్‌ స్వాతంత్య్రానికి స్వాగతం. ఢిల్లీలో బలూచిస్థాన్‌ దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయడానికి భారత్‌ అనుమతించాలని వారు కోరారు. మహిళలకు కీలక పాత్ర ఇచ్చేలా కొత్త ప్రభుత్వం పని చేస్తుందని వారు ప్రకటించారు.