Page Loader
Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా
రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా

Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో వంతెన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం బ్రయాన్స్క్‌లో రైలు వంతెన కూలిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుని 24 గంటలు గడవకముందే, మరో ప్రమాదం క్రస్క్‌లో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అక్కడి వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో దానిపై వెళ్తున్న గూడ్స్‌ రైలు బోల్తాపడింది. ఈ విషయాన్ని క్రస్క్‌ ప్రాంత గవర్నర్‌ అలెగ్జాండర్‌ కిన్స్‌టెయిన్‌ అధికారికంగా ధ్రువీకరించారు. ఘటన జరిగిన ప్రదేశం ఉక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉందని ఆయన తెలిపారు.

Details

నిన్న బ్రయాన్స్క్‌ ప్రాంతంలో ప్రమాదం

దీన్నికన్నా ఒక్క రోజు ముందే శనివారం బ్రయాన్స్క్‌ ప్రాంతంలో జరిగిన ప్రమాదం మరింత విషాదం నింపింది. పశ్చిమ బ్రయాన్స్క్‌ ప్రాంతంలో ఓ వంతెన కూలిపోవడంతో మాస్కో నుంచి కిల్‌మోవ్‌ వెళ్తున్న ప్రయాణికుల రైలు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్‌ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడ్డ వారి సంఖ్య 69కి చేరింది. మృతుల్లో రైలు డ్రైవర్‌ కూడా ఉన్నారు. ఈ