Loading...
USA Hindu Temple Attack : అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి.. ఆలయానికి తీవ్ర నష్టం!
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి.. ఆలయానికి తీవ్ర నష్టం!

USA Hindu Temple Attack : అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి.. ఆలయానికి తీవ్ర నష్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రిచ్‌మండ్ హైట్స్ ప్రాంతంలోని శ్రీ స్వామినారాయణ్ వడ్తాల్ ధామ్ హిందూ ఆలయంపై దుండగులు ఇటుకలు విసిరారు. దీంతో ఆలయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆలయంలోని కిటికీలు, తలుపులు, అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది

వివరాలు

రంగంలోకి ఎఫ్‌బీఐ విభాగం

ఆలయంపై జరిగిన దాడికి సంబంధించిన సర్వైలెన్స్ (సీసీటీవీ) వీడియోను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా ఘటనపై విచారణ చేపట్టారు.

దాడికి సంబంధించిన సమగ్ర వివరాలను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కి చెందిన సివిల్ రైట్స్ యూనిట్కు‌‌ కూడా అందించినట్లు అధికారులు తెలిపారు.

ఆలయ నిర్వాహకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సంబంధిత సంస్థ స్పష్టం చేసింది.

వారికి అవసరమైన అన్ని రకాల న్యాయపరమైన, ఇతర సహాయ సహకారాలను అందిస్తున్నట్లు తెలిపింది.

వివరాలు

నిందితుల అరెస్ట్‌కు డిమాండ్

ఈ దాడిని విద్వేషపూరిత నేరం (హేట్ క్రైమ్)గా పరిగణించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ కోరింది. ఘటనకు పాల్పడిన నిందితులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని దర్యాప్తు సంస్థలను డిమాండ్ చేసింది.

అమెరికాలో ఇటీవల హిందూ అమెరికన్ సమాజంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు, విద్వేషం పెరుగుతున్నాయని హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది.

భారతీయ, హిందూ సమాజాలపై జరుగుతున్న ద్వేషపూరిత దాడులను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు బహిరంగంగా ఖండించాలని కోరింది.

మరోవైపు మహాత్మా గాంధీ జయంతి రోజే, ఒహాయోలో అధికారికంగా ప్రకటించిన 'హిందూ హెరిటేజ్ మంత్' ప్రారంభమైన రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

ADVERTISEMENT