Loading...
Ukraine drone attack Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం.. మాస్కో రిఫైనరీపై డ్రోన్ దాడి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం.. మాస్కో రిఫైనరీపై డ్రోన్ దాడి

Ukraine drone attack Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం.. మాస్కో రిఫైనరీపై డ్రోన్ దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా రాజధాని మాస్కోలోని కపోట్న్యా చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం మాస్కోపై డ్రోన్ దాడుల దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడిలో రష్యాలోని కీలక చమురు మౌలిక వసతుల్లో ఒకటైన కపోట్న్యా రిఫైనరీ ప్రభావితమైనట్లు సమాచారం. తాజా దాడిపై నష్టం ఎంతమేరకు జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మాస్కోలోని కపోట్న్యా రిఫైనరీ నగరంలోని ప్రధాన చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటి. గతంలోనూ ఈ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిగాయి. జూన్‌లో జరిగిన దాడుల కారణంగా రిఫైనరీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు రాయిటర్స్ నివేదించింది

వివరాలు

ట్రంప్ ప్రకటన చేసిన ఆరు రోజులకే దాడి

ఈ ఘటనకు మరో ప్రత్యేకత ఉంది. ఆరు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్, రష్యా పరస్పరం తమ ఇంధన, ఇంధన మౌలిక వసతులపై దాడులు నిలిపివేయడానికి అంగీకరించాయని ప్రకటించారు.

సెప్టెంబర్ 14న ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఉక్రెయిన్, రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా ట్రంప్ ప్రకటనపై సందేహాలు వ్యక్తం చేశారు.

రష్యా తమ విద్యుత్ వ్యవస్థ, ఇతర కీలక మౌలిక వసతులపై దాడులు నిలిపివేస్తే.. ఉక్రెయిన్ కూడా రష్యా ఇంధన మౌలిక వసతులపై దాడులను నిలిపివేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

డీజిల్ ధరల పెరుగుదలపై ట్రంప్ వ్యాఖ్యలు

ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డీజిల్ ధరలపై కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధమేనని, ఇరాన్ యుద్ధం కాదని ఆయన పేర్కొన్నారు.

రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని ట్రంప్ అంతకుముందు కూడా వ్యాఖ్యానించారు.

అయితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు మధ్యప్రాచ్యంలోని ఇరాన్ యుద్ధం కూడా ప్రభావం చూపుతోందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలు ప్రపంచ చమురు సరఫరా మార్గాలపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు వెల్లడించాయి.

ADVERTISEMENT