Iran: అమెరికాకు మరో షాక్.. సీజ్‌ఫైర్ ప్రతిపాదనను అంగీకరించని ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా వెల్లడించింది. అర్థ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదికలను ఉటంకిస్తూ ఈ సమాచారం వెలువడింది. ఈ ప్రతిపాదనను బుధవారం ఒక మధ్యవర్తి దేశం ద్వారా అమెరికా పంపినట్లు తెలుస్తోంది.
వివరాలు
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం ప్రాంతీయ స్థాయిలో జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమైనట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ చర్చలను పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించినప్పటికీ ఎలాంటి పురోగతి సాధించలేకపోయాయి. టెహ్రాన్ ప్రభుత్వం తాము సమీప భవిష్యత్తులో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు ప్రతినిధులను పంపే ఉద్దేశం లేదని మధ్యవర్తులకు స్పష్టం చేసింది. అలాగే అమెరికా పెట్టిన షరతులు తమకు అసహ్యకరమని ఇరాన్ పేర్కొనడంతో ప్రస్తుత చర్చల వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయినట్లైంది.
వివరాలు
యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
దౌత్య ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో సైనిక ఘర్షణలు మరింత తీవ్రతరమవుతున్నాయి. శుక్రవారం హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ఏ-10 వార్‌థగ్ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు. ఇదే వారంలో కూల్చివేయబడిన రెండో అమెరికా యుద్ధవిమానం ఇది. అంతకుముందు ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. కొనసాగుతున్నా గాలింపు చర్యలు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానంలోని సిబ్బందిని వెతికే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక సిబ్బందిని రక్షించి వైద్య చికిత్స అందిస్తున్నామని అమెరికా సైన్యం వెల్లడించింది. అయితే మరొక సిబ్బంది పరిస్థితి ఇంకా తెలియరాలేదని CNN నివేదిక తెలిపింది.
వివరాలు
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్
కాల్పుల విరమణ కోరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఈ విషయంపై స్పందించిన ఇరాన్ ఉన్నతాధికారి, తాము తాత్కాలిక విరమణ కాదని, శాశ్వత శాంతికి హామీ ఇచ్చే ఒప్పందం కావాలని పేర్కొన్నారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించింది. ఏప్రిల్ ఫూల్స్ డే రోజున కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు జోకులకంటే మించి ఉన్నాయి. ఇప్పటికే డాక్టర్ పెజెష్కియన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా 'కొత్త అధ్యక్షుడు' గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. ఇలా దౌత్య చర్చలు విఫలమవుతుండగా, సైనిక ఉద్రిక్తతలు పెరుగుతూ మధ్యప్రాచ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.