Page Loader
కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు
కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు

కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని విండ్సర్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి ఘటన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినట్లు విండ్సర్ పోలీసులు తెలిపారు. వారు దేవాలయం గోడలపై నలుపు స్ప్రేతో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు రాసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీసీటీవీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విండ్సర్ పోలీస్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. నార్త్‌వే అవెన్యూలోని 1700 బ్లాక్‌లో ఉన్న దేవాలయంలో ఏప్రిల్ 5, 2023న ఈ హిందూ వ్యతిరేక ద్వేషపూరిత చర్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయం వెలుపల గోడపై నలుపు రంగులో స్ప్రే చేసినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విండ్సర్‌ పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ పుటేజీ