కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
కెనడాలోని మిస్సిసాగాలోని రామమందిరంపై కొందరు దుంగడులు దాడి చేశారు. దీంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యతిరేక భావం జాలం ఉన్న వారే ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రామమందిరాన్ని ధ్వంసం చేయడాన్ని టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై విచారణ జరిపి, నిందుతులపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది. ఈ మేరకే కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆలయం గోడలపై భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, సిక్కు అతివాద నాయకుడు భింద్రావాలాను నినాదాలు రాయడం గమనార్హం.
విచారణకు ఆదేశించిన బ్రాంప్టన్ మేయర్
రామమందిరాన్ని ధ్వంసం చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక హక్కు అన్నారు. కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. అంతకుముందు, జనవరిలో బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై భారతదేశ వ్యతిరేక చిత్రాలను దుండగులు గీశారు. ఈ చర్య ఖలిస్థానీ సానుభూతి పరుల పనేనని అనుమానిస్తున్నారు.