
No Kings Protests: ట్రంప్‌పై వ్యతిరేక నిరసనలు.. 'No Kings' ప్రొటెస్ట్స్ అంటూ లక్షల మంది వీధుల్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'No Kings' ప్రొటెస్ట్స్ పేరుతో నిరసనకారులు భారీగా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ఈ నిరసనలు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజెలెస్ వంటి 50 నగరాల్లో జరిగాయి. దేశానికి పరిమితి కాదని, కెనడా, బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్‌లోని యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా ట్రంప్ వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. అధికారంలోకి రాగానే ట్రంప్ తీసుకున్న వలసల నియంత్రణ, విశ్వవిద్యాలయాల నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ మోహరించడం వంటి చర్యలకు ఈ నిరసనలు ఎదురుగా వచ్చాయి. నిర్వాహకుల ప్రకారం, దేశవ్యాప్తంగా 2,500కి పైగా ప్రదర్శనలు నిర్వహించే ప్రణాళిక రూపొందించారు.
Details
ఎలాంటి అరెస్టు జరగలేదు
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం లక్షల సంఖ్యలో ప్రజలు శాంతియుతంగా పాల్గొన్నారు. అయితే ఎలాంటి అరెస్టులు జరగలేదని వెల్లడించారు. ఇండివిజిబుల్స్ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్ బర్గ్ ఈ నిరసనలకు ప్రాతినిధ్యం వహించారు. డెమోక్రాట్లతో పాటు పలు సంఘాలు, ప్రముఖ వ్యక్తుల నుండి నిరసనలకు పెద్ద మద్దతు లభించింది. ఈ నిరసనల వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, రిపబ్లికన్ పార్టీ వీటిని 'హేట్ అమెరికా' నిరసనలుగా ఖండించింది. ఈనిరసనల మధ్య, ట్రంప్ రాజకీయ ప్రచార బృందం విడుదల చేసిన ఏఐ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అధ్యక్షుడు రాజు దుస్తులు, కిరీటం ధరించినట్లు చూపించారు.ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పదినెలల్లో మూడు పెద్ద నిరసనలు జరగడం విశేషం.