Trump: "ఏదైనా జరగవచ్చు".. ఇరాన్‌తో యుద్ధం పై డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఎన్నికల ప్రచారం సమయంలో పదేపదే పేర్కొన్న అంశం ఏమిటంటే,"మళ్లీ అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపేస్తా". ఈ వ్యాఖ్య ఆయన విజయానికి కీలకంగా సహకరించిన అంశంగా చెబుతారు. అయితే,ట్రంప్ తాజాగా యుద్ధాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తన అధ్యక్ష పదవీకాలంలో ఇరాన్‌తో యుద్ధం జరిగే అవకాశాల గురించి ప్రశ్నించగా,ఆయన"ఏదైనా జరిగే అవకాశం ఉంది"అంటూ సంకేతాలు ఇవ్వడం విశేషం. టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానిస్తూ, "ఏదైనా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి. అతి ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, ఉక్రెయిన్ క్షిపణులను రష్యా వైపు ప్రయోగిస్తుండటమే. ఇది భయానక ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది," అని అన్నారు.
టెహ్రాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ
ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో, 2020లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ట్రంప్ ఆదేశాలతో అమెరికా దళాలు చేసిన వైమానిక దాడుల్లో సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ ట్రంప్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2020 ఎన్నికల సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక ఇరాన్ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై 2023 సెప్టెంబర్‌లో బైడెన్ ప్రభుత్వం టెహ్రాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌కు హాని చేయడానికి ప్రయత్నిస్తే, దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది.