Donald Trump: హోస్ట్‌తో వాగ్వాదం.. మైక్ పడేసి ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన ట్రంప్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహారశైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసిన ఆయన, చర్చ మధ్యలో మైక్రోఫోన్‌ను తీసి కిందపడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో భాగంగా ట్రంప్‌కు ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు ఎక్కడివరకు వచ్చాయనే అంశంపై హోస్ట్ ప్రశ్నించారు. అదే సమయంలో గత ప్రభుత్వం అన్యాయంగా కొందరిని లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ వారికి పరిహారం అందించేందుకు ప్రతిపాదించిన యాంటీ వెపనైజేషన్ స్కీమ్ గురించీ వివరణ కోరారు.
వివరాలు
కౌంటింగ్ ఆలస్యం కావడమే ఇందుకు నిదర్శనం
ఈ సందర్భంగా ట్రంప్ మాజీ అధ్యక్షుడు జో బైడన్, అలాగే మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని తాను గతంలో చేసిన ఆరోపణలను మరోసారి సమర్థించుకున్నారు. అయితే ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్ పదేపదే ప్రశ్నించారు. దీంతో ట్రంప్ సహనం కోల్పోయినట్లు కనిపించారు. ''ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనేందుకు చాలా ఆధారాలున్నాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతున్న మేయర్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా కౌంటింగ్ ఆలస్యం కావడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇక చాలు, ఇక్కడితో ఆపేద్దాం. థ్యాంక్యూ
దీనికి స్పందించిన హోస్ట్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కారణంగా ఆలస్యం జరుగుతూ ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. చర్చ మరింత వేడెక్కిన నేపథ్యంలో 'ఇక చాలు, ఇక్కడితో ఆపేద్దాం. థ్యాంక్యూ' అంటూ మైక్రోఫోన్‌ను తీసేసి కిందపడేశారు. ఇంటర్వ్యూను కొనసాగించాలని హోస్ట్ కోరినప్పటికీ, ఇప్పటికే చాలా సమయం కేటాయించానని చెప్పిన ట్రంప్ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Trump CRUSHES NBC microphone with his foot mid-exithttps://t.co/NjWUptvI4T pic.twitter.com/vACEtth7JL
— RT (@RT_com) June 7, 2026