Page Loader
రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు 
రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు

రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు 

వ్రాసిన వారు Stalin
May 26, 2023
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

యూకే ప్రధానమంత్రి రిషి సునక్ అధికారిక నివాసం లండన్‌లోని 10డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఒక వ్యక్తి హల్‌చల్ చేశాడు. కారుతో ఇంటి గేట్లను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో సునక్ ఆ నివాసంలో ఉన్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని మెట్రోపాలిటన్ పోలీసులకు అప్పగించారు. వెంటనే 10డౌనింగ్ స్ట్రీట్ రహదారిలో వాహనాలను నిలిపేశారు. అలాగే అధికారులను బయటకు రావొద్దని హెచ్చరికు జారీ చేశారు. అనంతరం దుండగుడు దూసుకొచ్చిన కారును ఫోరెన్సిక్, స్నిఫర్ డాగ్‌లతో తనిఖీ చేయించారు. అందులో ఏమీ లేదని తేలడంతో ఆంక్షలను ఎత్తివేశారు. తర్వాత కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో టెర్రరిస్టుల పాత్ర లేదని బ్రిటన్ పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సునక్ అధికార నివాసాన్ని కారు ఢీకొన్ని దృశ్యాలు