Page Loader
AIని ఉపయోగించి  గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు
ఈ సెల్ఫీల కోసం AI సాఫ్ట్‌వేర్ మిడ్‌జర్నీని ఉపయోగించారు

AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 21, 2023
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిన చిత్రాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఒక కళాకారుడు ఈ టెక్నాలజీని గతంలో ఉన్నవారితో సెల్ఫీలను సృష్టించడానికి ఉపయోగించారు. రెండు వేర్వేరు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో, కళాకారుడు జ్యో జాన్ ముల్లూర్ మహాత్మా గాంధీ, బి ఆర్ అంబేద్కర్, మదర్ థెరిసా, ఎల్విస్ ప్రెస్లీలతో సహా ప్రముఖ వ్యక్తులను సెల్ఫీ తీసుకుంటూనట్టు చిత్రాల సిరీస్ ను పోస్ట్ చేశారు. నా పాత హార్డ్ డ్రైవ్‌లో , గతంలో నా స్నేహితులు నాకు పంపిన సెల్ఫీల కనిపించాయని కళాకారుడు పోస్ట్ టైటిల్ లో రాశాడు. మిస్టర్ ముల్లర్ ఈ సెల్ఫీలను చిత్రీకరించడానికి AI సాఫ్ట్‌వేర్ మిడ్‌జర్నీని చిత్రాలను మళ్లీ పెయింట్ చేయడానికి ఫోటోషాప్‌ను ఉపయోగించినట్లు చెప్పారు.

ఇంస్టాగ్రామ్

రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన చిత్రాలకు వేల సంఖ్యలో లైక్స్

ఈ చిత్రాలలో సోవియట్ యూనియన్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్, మాజీ US అధ్యక్షుడు అబ్రహం లింకన్, శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జమైకన్ గాయకుడు బాబ్ మార్లే, అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు చే గువేరా తదితరులు ఉన్నారు. ముల్లర్ కేవలం రెండు రోజుల క్రితం ఈ AI చిత్రాలను పంచుకున్నారు. అప్పటి నుండి వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు ఈ పోస్ట్ కు వచ్చాయి. హైపర్-రియలిస్టిక్ ఆర్ట్‌వర్క్ కు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది.