
మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.
ఈ పేలుళ్లపై పాకిస్థాన్ వింత ఆరోపణలు చేస్తోంది. దీని వెనుక భారత గూఢచార సంస్థ ప్రమేయం ఉన్నట్లు పొంతనలేని వాదనలు చేస్తోంది.
బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో శుక్రవారం ఒక మసీదు సమీపంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఊరేగింపులో ఆత్మాహుతి దాడి జరిగింది.
కొన్ని గంటల తర్వాత, ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని హంగూ నగరంలోని మసీదులో మరో పేలుడు సంభవించి కనీసం 5 మంది మరణించారు.
అయితే పేలుళ్ల వెనుక భారత గూఢచార సంస్థ 'రా' ప్రమేయం ఉన్నట్లు పాక్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆరోపించారు.
పాక్
ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి డీఎన్‌ఎను పరీక్షకు పంపాం: పాక్ మంత్రి
ఆత్మాహుతి బాంబు దాడి చేసిన వ్యక్తి నుంచి డీఎన్‌ఎను విశ్లేషించడానికి పంపినట్లు మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ చెప్పారు.
బలూచిస్తాన్‌లోని మదీనా మసీదు సమీపంలోని మస్తుంగ్ అనే ప్రదేశంలో జరిగిన ఘోర ఆత్మాహుతి పేలుడులో మొత్తం 65మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు.
ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని హంగూలో పోలీస్ స్టేషన్ మసీదును లక్ష్యంగా చేసుకుని జరిగిన రెండో బాంబు దాడిలో ఐదుగురు మరణించారు. 12 మంది గాయపడ్డారు.
ఈ దాడిపై ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
పాకిస్థాన్‌లో జరిగిన కొన్ని రక్తపాత దాడులకు కారణమైన నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ సంస్థ ఇందులో తమ ప్రమేయం లేదని చెప్పింది.
ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సీటీడీ తెలిపింది.