Nasa: అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ.. భూమి పైకి సురక్షితంగా వ్యోమగాములు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి చేరారు. ఇటీవల నాసా ఒక వ్యోమగామికి మెడికల్ అత్యవసర పరిస్థితి తలెత్తినందున, ఆ మిషన్‌ను ముందుగానే ముగించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, అనారోగ్యానికి గురైన వ్యోమగామి సహా క్రూ-11 మిషన్‌లో పాల్గొన్న నలుగురు ఆస్ట్రోనాట్లను తీసుకుని డ్రాగన్ వాహకనౌక ఎండీవర్ గురువారం అమెరికా, కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. అసలు ఘటన వెనుక వాస్తవం ఇలా ఉంది. క్రూ-11 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఆగస్టులో ISS కు చేరారు.
వివరాలు
ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్
ఈ మిషన్‌లో, ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ను నాసా ప్లాన్ చేసింది. జనవరి 8న (అమెరికా కాలమానం ప్రకారం)మైక్ ఫిన్సీ,జెనా కార్డ్‌మన్‌లుగా ఇద్దరు వ్యోమగాములు 6.5గంటల పాటు స్పేస్‌వాక్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో, మెడికల్ సమస్యల కారణంగా నాసా ఈ స్పేస్‌వాక్‌ను వాయిదా వేసింది. అదే సమయంలో, ఆరోగ్య సమస్య కారణంగా మిషన్‌ను ముందే ముగిస్తూ, వ్యోమగాములను భూమి పైకి తీసుకురానుందని నాసా ప్రకటించింది.
వివరాలు
చాలా అరుదుగా అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు
ఫిబ్రవరిలో పూర్తి అవ్వాల్సిన మిషన్ ఒక నెల ముందే ముగియడంతో, వైద్య, భద్రతా కారణాల వల్ల నాసా ఆ వ్యోమగామి పేరు, ఆరోగ్య పరిస్థితులను బయటపెట్టలేదు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు చాలా అరుదుగా ఎదురవుతాయి. గతంలో, మైక్రోగ్రావిటీ కారణంగా వ్యోమగాముల్లో రక్త ప్రసరణ సరిగా కాకపోవడం, రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు రావటాన్ని నాసా గమనించింది, కానీ ఈ ఘటనలను కూడా ప్రచారంలోకి రాబట్టలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్పేస్ x చేసిన ట్వీట్
Splashdown of Dragon confirmed – welcome back to Earth, @zenanaut, @AstroIronMike, @Astro_Kimiya, and Oleg! pic.twitter.com/2Yrgvy6DJO
— SpaceX (@SpaceX) January 15, 2026