
పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‍లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో ఇస్లామిస్ట్ పార్టీ జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఎఫ్ (జేయూఐ-ఎఫ్) నిర్వహించిన రాజకీయ సభలో ఆత్మాహుతి దాడి జరిగింది.
ఈ ఘటనలో 44 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. పేలుడు జేయూఐ-ఎఫ్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చేసినట్లు తెలుస్తోంది.
పేలుడులో 10 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు, సంఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలను సేకరించామని కేపీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు.
ఆత్మాహుతి దాడి జరిగిన చోటు అంతటా రక్తపు మరకలే ఉన్నాయని ప్రత్యేక్ష సాక్షి ఒకరు చెప్పారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది బజౌర్, పరిసర ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో ఐసీయూలో చేర్పించారు.
ఆత్మాహుతి దాడి
ఆత్మాహుతి దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్?
తీవ్రంగా గాయపడిన వారిని బజౌర్ నుంచి మిలిటరీ హెలికాప్టర్ల ద్వారా ప్రావిన్షియల్ రాజధాని పెషావర్‌లోని ఆస్పత్రులకు తరలించారు.
పార్టీకి సీనియర్ నేతలు కూర్చున్న వేదికకు సమీపంలోనే ఆత్మాహుతి బాంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న, ఆఫ్ఘన్ తాలిబాన్‌కు శత్రువు అయిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడి వెనుక ఉండవచ్చన్న ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ దాడిని ఖండించారు. గాయపడిన, మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని అధికారులను కోరారు.
2014నుంచి వాయువ్య ప్రాంతంలో జరిగిన నాలుగు అత్యంత ఘోరమైన బాంబు దాడుల్లో ఇది ఒకటిగా చెబతున్నారు. ఇప్పటివరకు జరిగిన పలు బాంబు దాడుల్లో 147మంది మరించారు.